లేఖలు(PAGE 3)


🌈హోళీ-సందేశం🌈

*గోపికలతో ఆడుకుంటున్న బాల కృష్ణున్ని రాధ నల్ల వాడని ఆట పట్టించిందట.దీంతో కృష్ణయ్య అలిగాడు.అలిగిన కృష్ణయ్యను శాంత పరచడానికి అమ్మ యశోద రాధపై ముఖానికి రంగులు పూయమని చెప్పిందట*
కృష్ణుడు అలాగే చేసాడు.గోపికలందరూ రంగులు చల్లు కున్నారు.అలా హోళీ పండుగ పుట్టిందని నానుడి.

అలాగే మన జీవితాలలో కూడా అలకలు, కినుకలు,
తొందరపాటులు,కోపాలు,తాపాలు,
తెలిసో తెలియకో అవేశ కావేశాలు
అనుకోని ఎడబాటులు,తడ బాటులు,మన అనుకున్న వారు దూరం ఐన సందర్భాలు ఉంటాయి.ముఖ్యంగా ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట,ఆట, కాకుండా
కుటుంబ సభ్యులు,
బంధు,మిత్రులైన వారితో
మన వళ్ళో,వారి వళ్ళో ఏర్పడిన
మానసిక దూరాన్ని తగ్గించు కుని,
*అందరం కలిసే రోజుగా మనమే ముందుగా ఒక అడుగు వేసి దగ్గర చేసు కునే సమయమే ఈ హోళీ.*

అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతి అందం. అందరిని కలుపు కుంటేనే మనసుకి అందం
అన్ని ఆలోచనలను పరిగణించి
చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం.. హోళి రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు.
*ఇంకెందుకాలశ్యం మాట జారిన వారిపై ముందుగా రంగులు జల్లేద్దాం.*
దూరం పెట్టిన వారిని దగ్గరగా చేర్చుకుందాం.
ఇదే కృష్ణ తత్వ రహస్యం.




🌹అందమైన ఆదివారము*🌹

వేకువఝామున పిల్ల గాలిలా,
ముంగిలిలో ముత్యాల ముగ్గులా,
తొలివెచ్చని సూర్యకిరణంలా,
కిటికిలోంచి తొంగిచూసే పూల పరిమళంలా,
బోసినవ్వులొలికించే పసిపాపలా,
నదిలో చిలిపిగా ఆడె చేపపిల్లలా,
గల గలా ప్రవహించే గోదారిలా,
కిలకిల గానంతో కొకిలలా,
తేట తేనెలొలుకు తెలుగు మాటలా,
పడుచందాల పరికిణితో,
స్వచ్చమైన మనసులా,
సాయంకాలపు బింబంలా
రాత్రి పండు వెన్నెలలా,
అటు ఇటు అందంగా ఊగుతూ
గడియారపు లోలకాన్ని తలపించే చెవిలోలాకులా,
ముత్యమంత ముక్కు పుడకలా,
గలగలమంటు గాజుల సవ్వడిలా,
స్వాగతించే చిరునవ్వులా,
చిటపటలాడే వాన చినుకులా,
ప్రకృతి ఒడిలో విహరించే సీతాకోక చిలుకలా,
మొత్తం కలబోస్తే
అది,అదే, అది
శుభోదయం
నవోదయం
మహోదయం
మిత్రోదయం
రవోదయం
సూర్యోదయం
భానూదయం
ఖగోదయం
పూష్ణోదయం
హిరణ్యగర్భోదయం
మరీచోదయం
ఆదిత్యోదయం
సవిత్రోదయం
అర్కోదయం
భాస్కరోదయం
జయోదయం
ఆనందోదయం
*అందమైన ఆదివారం*
పార్వతీపతి



No comments:

Post a Comment