పద్యాలు
read and comment
చిల్లి కుండ లోన జలము బోసిననేమి
కుండ నుండ కుండ కారిపోవు
మట్టి మెదడు లోకి మంచేల యెక్కును?
విశ్వ గురువు దివ్య విష్ణు దేవ!
మంచివాని చుట్టు మంచింత లేకున్న
వాని లోని మంచి వెడలిపోదు;
ముళ్ళ కంప నున్న మల్లె వాసనవోదు
విశ్వగురువు దివ్య విష్ణుదేవ!
కాకి కపిల తీగ తాకినేమవదని
మనిషి జేరి తీగ ముట్ట దగదు
తలము గుణము తెలిసి మెలిగిన మేలౌను
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
మట్టి మెదడు లోకి మంచేల యెక్కును?
విశ్వ గురువు దివ్య విష్ణు దేవ!
మంచివాని చుట్టు మంచింత లేకున్న
వాని లోని మంచి వెడలిపోదు;
ముళ్ళ కంప నున్న మల్లె వాసనవోదు
విశ్వగురువు దివ్య విష్ణుదేవ!
కాకి కపిల తీగ తాకినేమవదని
మనిషి జేరి తీగ ముట్ట దగదు
తలము గుణము తెలిసి మెలిగిన మేలౌను
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
అందమైన నగర మన్నవున్నవి గాని
అందమైన బతుకులందు లేవు
పైన రంగు పూసుకున్న
మిథ్యలవంతా
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
మంచ దేంత దైన మీదకగుపడదు
చిన్న దైన తప్పు చెవిలో కెక్కు
చిన్న ఇందు మచ్చ చేరుచు దానందమ్ము
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
గురువనుగ్రహంబు గోల్పోయిన నరుడు
ఎల్ల రాజ్య మేలు ఎవడు గాని
మెల్ల మెల్లగ తను మట్టి మట్టమగును
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
చేయ గోరిన పని చేదైనవిడువకు
తీపి,చేదు యందెదాగి యుండు
చెమట గారకుండ జయమేల గల్లును?
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
పాడు మిత్రులుండి ఫలమేమనేకులు
నిలుపు మొకని మైత్రి నూరు యేండ్లు
రాళ్ళ కుప్ప లేల? రత్న మొకటి చాలు
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
అందమైన నగర మన్నవున్నవి గాని
అందమైన బతుకులందు లేవు
పైన రంగు పూసుకున్న
మిథ్యలవంతా
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
గుణము దూగు ధనము గలదేది మహిలోన?
గుణమే విలువ పెంచు, కాదు ధనము
గుణమే ఆభరణము, గుణమె అందమ్మయా
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!
No comments:
Post a Comment