Sunday 19 April 2020

Current affairs April 18

Matterhorn mountain is a mountain of the Alps, straddling the main watershed and
Matterhorn mountain
 border between Switzerland and Italy. It is a large, near-symmetric pyramidal peak in the extended Monte Rosa area of the Pennine Alps, whose summit is 4,478 metres (14,692 ft) high, making it one of the highest summits in the Alps and Europe.

----------------------------------------------------
What is LTRO or TLTRO?


1. LTRO is a tool that lets banks borrow one to three-year funds from the central bank at the repo rate, by providing government securities with similar or higher tenure as collateral.
2. It is called 'Targeted' LTRO  as in this case, the central bank wants banks opting for funds under this option to be specifically invested in investment-grade corporate debt.
3. LTRO was first introduced by the European Central Bank during its sovereign debt crisis that began in 2008. LTRO was an acronym coined by the ECB that stood for "long-term refinancing operations".

____________________________________
Cinchona

  • America where cinchona is a native plant. 

• There was a huge demand for chloroquine during WW-2 as soldiers effected by malaria.




• Invented it inSouth around 1940
• Drug was not invented by Acharya chadta ray. 
○ father of chemical science in India. 
○ Bengal chemicals and pharmaceuticals


_____________________________________________

More posts:


  1. April month current affairs






Wednesday 2 October 2019

తదర్పణం
--------------------
రంగు రంగుల పూలు
రంగవల్లుల్లా పేర్చి
రాగాలు తీసి
బతుకమ్మాడితే
ఆ పూల లాగే జీవితం
రంగులమయం అవుతుందనే నమ్మకం! 

విడి విడి మానుల
కన్నబిడ్డలు ఆ పూలు



కన్నుల పండుగగా
ఒకఘ చోటచేరాయి
మనుషులందరినీ
ఒకేచోటచేర్చాయి!
ఏకత్వానికన్నా ఉక్కు బలమైందేమీ కాదు
సబ్బండవర్ణ సమూహం కన్నా
వజ్రం అందమైందేమీ కాదు!

బతుకమ్మ పండుగొస్తే
మా ఇంటికి ఆడబిడ్డొచ్చినట్లే
సంబురం మా కళ్ళలో
సంద్రమై పొంగుతుంది!

ప్రకృతిచ్చిన వన్నీ పరమోత్కృష్టం
తల్లీ కృతజ్ఞతతో తదర్పణం
మనిషి ప్రకృతితో తాదాత్మ్యం
ఇదే బతుకమ్మ పండుగ అంతరార్థం

బతుకమ్మా..
నువ్వు మా చారిత్రక,సాంస్కృతిక గీతిక!
తెలంగాణా మెతక మెతుకు బతుకు పతాక!!




శక్తి - యుక్తి
-------------------
వెలుగు
చీకటి వైపు వెళ్తుంది
పరిణామం
అని కొందరంటారు
కానీ దాని
పర్యావసానాన్ని ఊహించ జడుస్తున్నారు!

అన్నింటికీ శక్తి కావాలి
యుక్తితో శక్తి మూలం గ్రహించాలి.
వెంట్రుకలు కోస్తే



మళ్ళీ మొలుస్తాయేమో?
తలే తీసేస్తే?

శాస్త్ర సాంకేతికతలో
ప్రగతి అవసరమే
దానికి అడవి తల్లి ప్రాణం,
తధాధారిత ప్రాణాలు
ఖరీదు కాకూడదు!

నేడు నల్లమలే
రేపు ఎల్లజగం!
పుడమి తల్లి
నిలువు దోపిడి
ప్రాణి మనుగడ
ప్రశ్నార్దకమే!

తస్మాత్ జాగ్రత్త
ప్రకృతి ప్రకోపించక ముందే!

#poetry #Telugu #kavitha #nreddyinfo #poems #literature #Savenallamala

Wednesday 20 February 2019

నాటిక:


                                 
                            ముళ్ళ  దారి
                                    
                                      భాగం-1                                

రఘునాథపురం బడిలో..


అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా
నెక్కిన బారని గుర్రము 
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ...!


ఉపాధ్యాయుడు: అందరూ రేపీ పద్యం అప్ప జెప్పాలి. సరేనా?

మరుసటి దిన౦

:   రాజు లేచి నిన్న చెప్పిన పద్యం చెప్పు?

రాజు :   ( కంగారుపడితూ ) అక్కరకు రాని చుట్టము

                                        ఎక్కిన వరమియ్యని తాల్పు.. (ఆపేసాడు)

       :      అయితే తమరు నేర్వలెదనమాట..

రాజు    :     నిన్న నేను శేనికి వోయి బర్రెలు గొట్టుకొచ్చిన సార్.. అవుటికి మ్యాత గూడ నేనే             గోసుకొచ్చిన. అందుకే నేర్వలేదు సార్..

        :     ఉమ నువ్ చెప్పు..

ఉమ    :     నేను గూడ నేర్వ లేదు సార్. మా ఇంట్లో పనంతా నేనే జేసిన.

        :     అర్థమైంది. మీరిద్దరే కాదు మీరెవ్వరూ నేర్వలేదు కదా ?

  ( పిల్లలందరూ తలలు కిందకు దించుకున్నారు )

                  నేను ఈ బడికి వచ్చి 10 రోజులు అవుతుంది. ఎప్పుడు ఏది నేర్చుకు రమ్మన్నా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు.               

  రేపు నేను మీ ఇండ్లకు వోత. మీరు చెప్పింది అబద్ధం అని తేలాలె మీరు నా కోపం చూస్తారు.

                  (ఉపాధ్యాడు పిల్లల ఇండ్లకు బయల్దేరాడు.)

                 ఉమ పిన్ని కుర్చీ మీద కూర్చుని పేపరు చదువుతూ ఉంది..

రాజ్యం :   ( అతివినమ్రంగా.. ) పంతులు గారు బాగున్నారా ? ఇట్లొచ్చిన్రే౦ది ?

        :    బావున్నానండి. ఏమీ లేదు. మీ అమ్మాయి ఉమ ఇ౦టి పని చెయమని చెప్పినప్పుడల్లా ఇంటి  పని అంతా నేనే చేసాను అని చెప్తుంది. మీ అమ్మాయితో  ఇంటి పనులన్నీ చేయిస్తున్నారా?

రా :      :   రామ రామ. అది మా ఇంటి మా లచ్మి సారు. ఆ పనులన్నీ దాని తో ఎందుకు చేయిస్తం.

               (అంతలోనే చేతిలో ఆయుధం(చీపురు) తో రాజ్యం భర్త వచ్చాడు .)

రా. భ   :   అంతా అబద్దం సారు. నా పెండ్లాం ఉమ రెండేళ్ళు ఉన్నప్పుడే చచ్చిపోయింది. ఉమ కు తల్లి అవసరమని దీన్ని జేసుకున్న ఇదేమో దాని బిడ్డలా కాదు కదా కనీస౦ మనిషిలా కూడా చూడదు సారు. చిన్న పిల్ల అని గూడ సూడకుండా పనంతా దాంతోనే చేయిస్తది సారు .

రా      :    ( ఆమె అసలు గొంతు బయట పెడుతూ ) అయినా పంతులు మా యింటి విషయాలు నీకు ఎందుకు ? నువ్ పాఠాలు చెప్పు సాలు.

      :    ఉపాధ్యాయుడి పని పాఠాలు చెప్పడం మాత్రమే కాదమ్మా.. పిల్లల మంచిచెడులు వారు కుంటుంబ నేపథ్యం తెలుసుకోవడం కూడా. ఇంకో సారి ఉమతో ఇట్లాంటి పనులు చేయిస్తే జైలు భోజనం రుచి

              చూడాల్సొస్తది.

             ( రాజ్యం కోపంతో ఆ ఉపాధ్యాయుడి ని చూస్తూ నిలబడి పోయింది. తన కూతురు జీవితం ఇక నుంచైనా మారుతుందన్న ఆశ తో చేతిలో ఆయుధం తో లోనికి వెళ్ళాడు. )



                                                                                                                                     భాగం-2

      

              ( ఉమ మీద ఊరికనే కోప్పడ్డానని మనసులో అనుకుంటూ  రాజు వాళ్ళ ఇంటికి  బయలుదేరాడు.)

 దారి మధ్యలోనే రాజు తండ్రి ఎదురవుతాడు. ఆయన ఏదో ఆలోచించుకుంటూ పంతుల్ని గమనించకుండా వెళుతుంటాడు.

                 :     బాలయ్య గారు... నేను మీ ఇంటికనే వస్తున్నాను.

బాలయ్య      :     మా పిల్లగాడేమైనా కొంటె పని చేసిండా సారు ? (నీరస౦గా, నీళ్ళు ని౦డిన కళ్ళతో అడిగాడు)

                 :     రాజును మీరు రోజూ శేనికి పంపిస్తారా ?

బా                :     నేను మా ఇంటిది దొర శేన్లో కూలికి పోతము సారు. ఉన్న రెండు బర్రెలను దినా౦వాడే ఊరి బయట మేపుకొస్తడు.

                 :     ఇట్ల జేస్తే ఎట్ల ? పిల్లతో ఈ పనులన్నీ జేయిస్తే వాళ్ళ చదువేమ్ సాగుతది ?

బా                :     ఏ౦ జెయ్యాలి సారు . మాకు పిల్లల్ని మంచిగ సదివియ్యాలని ఉండదా ? మా పేద బతుకులు ఇంతే. అందరి రెక్కలు ఆడితే గాని డొక్కాడదు. ( అని కన్నీళ్ళు పెట్టుకున్నడు ) 

                 :     అయ్యో బాధ పడకండి. పర్వాలేదు.

బా                :     వర్షాలు వర్షాకాల౦ లోనే సారు. కానీ మా కన్నీటి వర్షాలు యేడాది అంతా ఉంటాయి. ఒకింటికిస్తే నా బిడ్డ సుఖపడ్తది అనుకున్నా కానీ దాని బతుకు గూడ కష్టాల పాలయ్యింది. మొగుడు ఒట్టి      తాగుబోతు. పైసా పని చెయ్యడు దాని అత్త మామలు దాన్ని కట్నం కోసం రోజూ చిత్ర హింసలు వెడ్తరు. బాధలు దిగ మింగి అలిసిపోయిందో ఏమో పాపం. నిన్న ఇసం తాగింది. మా అదృష్టం కొద్దీ బతికింది. ఇప్పుడు దవాఖానా నుంచే వస్తున్నా.

                :      చూస్తూ ఊరుకుంటారా. పోలీసులకు ఫిర్యాదు చెయ్యాల్సింది.

బా               :      ఆడపిల్ల తండ్రిని సారు. ఎవ్వరకు చెప్పలే దాని బతుకు బజార్లో పడ్తదని. ఈ విషయం మా ఇంటిదానికి కూడ తెల్వదు సారు. తెలిస్తే దాని దు:ఖం ఆపడం నాతోని కాదు. అయినా మా కష్టాలన్నీ మీతో చెప్పి ఇబ్బంది వెడ్తున్నట్టు ఉన్నా.. ఒస్తా సారు ( నెమ్మది గొంతుతో అని వెళ్ళిపోయాడు  )

 పంతులు బాధతో బరువెక్కిన హృదయంతో మారు మాటాడకుండా ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాడు. ఈ ఇద్దరు పిల్లల పరిస్థితే కాదు అందరు పిల్లల పరిస్థితీ అంతే అని అతనికి అర్థం అయింది. అందుకే మిగితా పిల్లల ఇండ్లకు పోలేదు.



సంధ్యా సమయం.. పఠశాల ప్రాంగణం.

ఉపాధ్యాయుని స్నేహితుడు వచ్చాడు...

కుమార్      :       ఎలా ఉన్నవ్ రా ? (2 సార్లు అంటాడు)

              :       ఎప్పుడొచ్చావ్ రా ? అకస్మాత్తుగా ఊడిపడ్డావ్ ? (ఎక్కడో ఆలోచిస్తూ కుమార్ తో మాట్లాడుతున్నాడు)

కు              :       సిటీ లో పెరిగావ్ సిటీ లో చదువుకున్నావ్ ఈ మారు మూల గ్రామం లో ఎలా ఉన్నావో చూసి పోదామని వచ్చాన్రా..

 స్నేహితుడు ఒచ్చాడన్న సంతోషం అతని ముఖం లో కనపడటం లేదు. మాట కలపకుండా మౌనంగా ఉండి పోయాడు. ఇది గమనించి కుమార్ ఏమైంది రా అలా ఉన్నావ్ ? అని అడిగాడు

              :       ఏమీ లేదురా (అని మాట మార్చడాని ప్రయత్నిస్తాడు)

కు             :       రాగానే అనుకున్నా ముఖం ఎందుకొ కాంతిహీనంగా కంపిస్తుంది అని

              :       బాధలు, కష్టాలు ఇవే గా మనిషిలోని కా౦తుల్ని మింగేసేవి ?

కు             :        వచ్చి పది రోజులు కాలేదు . అన్ని కష్టాలు ఏమొచ్చాయ్ రా నీకు?

             :        మన కష్టాలు మాత్రమే మనవారా ? మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా లేనప్పుడు మనమెలా సంతోషంగా ఉండగలం?

  పట్నం ఒడిలో పెరిగాను, చదువుకున్నాను . పల్లె నన్ను మళ్ళీ విద్యార్థిని చేసిందిరా... చాలా నేర్పించింది. కష్టాల పిడుగుల్ని గుండెల్లో మోస్తున్న మనుషుల్ని చూపి౦చింది. పేద కుటుంబాల పరిస్థితి బాగుపడటం లేదు. ఆ కుటుంబాల పిల్లల  భవిష్యత్తూ బాగుపడటం లేదు. కష్టం మీద కష్టం వాళ్ళ గుండె కేసి బలంగా కొడితే వాళ్ళ పిల్లలకు చదువు ఎలా చెప్పిస్తరు? చదువుకునే      వాతావరణం ఎలా కల్పిస్తరు? అందుకేరా కొందరు పిల్లలు 8వ తరగరి లోనే చదువు ఆపేస్తున్నరు. ఇంకొందరు 5వ తరగతి లోనే బడి మానేస్తున్నరు. చాలా మంది ఆడపిల్లకు అయితే బడి ముఖం చూసే అదృష్టం కూడా దక్కడం లేదు. కష్టాలు, కుటుంబ పరిస్థితులు చుట్టు ముడుతే పిల్లల చదువు సాగడం ఎంత కష్టమో ఈ పల్లె కొచ్చాకే అర్థం అయ్యిందిరా.

 ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఏదో తెలియని మౌనం వాళ్ళని ఆవహించింది. నిస్సహాయంగా  సంధ్యకేసి చూస్తూ నిలబడిపోయారు.



తెల్లారితే సూర్యుడొస్తాడు. వెలుగులు తెస్తాడు. కానీ పల్లెలోకి మాత్రమే. పల్లెటూరి బతుకుల్లోకి కాదు.
                                           -నర్సింహారెడ్డి



                                                  
Narsimhareddy