తదర్పణం
--------------------
రంగు రంగుల పూలు
రంగవల్లుల్లా పేర్చి
రాగాలు తీసి
బతుకమ్మాడితే
ఆ పూల లాగే జీవితం
రంగులమయం అవుతుందనే నమ్మకం!
విడి విడి మానుల
కన్నబిడ్డలు ఆ పూలు
కన్నుల పండుగగా
ఒకఘ చోటచేరాయి
మనుషులందరినీ
ఒకేచోటచేర్చాయి!
ఏకత్వానికన్నా ఉక్కు బలమైందేమీ కాదు
సబ్బండవర్ణ సమూహం కన్నా
వజ్రం అందమైందేమీ కాదు!
బతుకమ్మ పండుగొస్తే
మా ఇంటికి ఆడబిడ్డొచ్చినట్లే
సంబురం మా కళ్ళలో
సంద్రమై పొంగుతుంది!
ప్రకృతిచ్చిన వన్నీ పరమోత్కృష్టం
తల్లీ కృతజ్ఞతతో తదర్పణం
మనిషి ప్రకృతితో తాదాత్మ్యం
ఇదే బతుకమ్మ పండుగ అంతరార్థం
బతుకమ్మా..
నువ్వు మా చారిత్రక,సాంస్కృతిక గీతిక!
తెలంగాణా మెతక మెతుకు బతుకు పతాక!!
--------------------
రంగు రంగుల పూలు
రంగవల్లుల్లా పేర్చి
రాగాలు తీసి
బతుకమ్మాడితే
ఆ పూల లాగే జీవితం
రంగులమయం అవుతుందనే నమ్మకం!
విడి విడి మానుల
కన్నబిడ్డలు ఆ పూలు
కన్నుల పండుగగా
ఒకఘ చోటచేరాయి
మనుషులందరినీ
ఒకేచోటచేర్చాయి!
ఏకత్వానికన్నా ఉక్కు బలమైందేమీ కాదు
సబ్బండవర్ణ సమూహం కన్నా
వజ్రం అందమైందేమీ కాదు!
బతుకమ్మ పండుగొస్తే
మా ఇంటికి ఆడబిడ్డొచ్చినట్లే
సంబురం మా కళ్ళలో
సంద్రమై పొంగుతుంది!
ప్రకృతిచ్చిన వన్నీ పరమోత్కృష్టం
తల్లీ కృతజ్ఞతతో తదర్పణం
మనిషి ప్రకృతితో తాదాత్మ్యం
ఇదే బతుకమ్మ పండుగ అంతరార్థం
బతుకమ్మా..
నువ్వు మా చారిత్రక,సాంస్కృతిక గీతిక!
తెలంగాణా మెతక మెతుకు బతుకు పతాక!!
శక్తి - యుక్తి
-------------------
వెలుగు
చీకటి వైపు వెళ్తుంది
పరిణామం
అని కొందరంటారు
కానీ దాని
పర్యావసానాన్ని ఊహించ జడుస్తున్నారు!
అన్నింటికీ శక్తి కావాలి
యుక్తితో శక్తి మూలం గ్రహించాలి.
వెంట్రుకలు కోస్తే
మళ్ళీ మొలుస్తాయేమో?
తలే తీసేస్తే?
శాస్త్ర సాంకేతికతలో
ప్రగతి అవసరమే
దానికి అడవి తల్లి ప్రాణం,
తధాధారిత ప్రాణాలు
ఖరీదు కాకూడదు!
నేడు నల్లమలే
రేపు ఎల్లజగం!
పుడమి తల్లి
నిలువు దోపిడి
ప్రాణి మనుగడ
ప్రశ్నార్దకమే!
తస్మాత్ జాగ్రత్త
ప్రకృతి ప్రకోపించక ముందే!
#poetry #Telugu #kavitha #nreddyinfo #poems #literature #Savenallamala
No comments:
Post a Comment