Friday, 26 October 2018

కవితలు(page 2)

   భారతీ 

-----------------------------

కరుణరసవీణ మృదుమధుర
రాగాభివందనం భారతీ నీకు వందనం

క్షితం కొంతైనోపజాలని
పుణ్య పుడమికి వందనం
భారతీ నీకు వదనం
దివ్య భారతీ నీకు వందనం!

జమున గంగాది నదుల శోభిత
అమృత వర్షిణి వందనం
భారతీ నీకు వదనం
దివ్య భారతీ నీకు వందనం!

సర్వమతముల నిలయమైన
నిర్మల మనసుకు వందనం
భవ్యభారతీ నీకు వందనం!

కావ్య రసముల ఊటలూరే
కవితధారలు కురిసిపారే
సకల సాహితీ సత్సంపద
ప్రదీప్తి భారతి వందనం!

విలువ వెలుగుల తేజరిల్లిన
చైతన్య గీతుల పల్లవించిన
భారతీ నీకు వందనం
దివ్య భారతీ నీకు వందనం!

నీదు చరితము ప్రవచనీయము
విన్న వీనుల జన్మధన్యము
గొప్ప చరితల పరిఢవిల్లిన
భారతీ నీకు వందనం!

నీదు పాదములాన తల్లీ
మరణమైనా వదల వెళ్ళి
నీదు ఒడిలో ఆడు నాకు
వేరు ఉన్నద స్వర్గమన్నది!!




ఎగిసిన మంటలు

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
ఔనౌను కొన్నిసార్లు
కర్రలు కరవాలై
కుతుకలు తెగనరుకుతయ్

ఔనౌను కొన్నిసార్లు
పావురాలు పాములవలె
పగబడుతయ్, విషమిడుతయ్

ఔనుమరీ కొన్నిమార్లు
తెలి,చలి కైరవి
ఎరుపెక్కి కాలుతది

ఔను సుమా అలసినవీ
అలసి అలసి విసిగినవీ
వేలెత్తి అడుగుతయ్
తమదంతా తమదేనని
కాలెత్తి తన్నుతయ్
పోరాటంలోంచె కదా
పుట్టుకొచ్చు స్వేచ్చసుధ!






చేదుమిఠాయి

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
అంతా ప్రశాంత౦
నిర్మలం ఆకాశం
అంతలోనె తమస్సులు
దిక్కులంతా చిమ్ముకున్నాయ్

ఒక్కసారి వాతావరణం మారింది
నీలాకాశం నలుపెక్కెంది
ఉరుముల శబ్దాలు
కర్ణాన్ని కలవర పెడుతున్నాయ్

అంతా మంచికేనని
మనసు ధైర్యం చెబుతుంది
అంతలోనే మేఘాలకు చిల్లులు పడ్దాయు
చినుకులు భూమిని ముద్దాడాయి

ఆనందంతో అర కిలో
మిఠాయి పంచేసాడు రైతు
చినుకులు కాస్త
కుండపోత వర్షంగా మారాయి

దానికి గాలి తోడైంది
అంతా భీభత్సం ఐపోయింది
పొలం ఏరైంది
పంట మునిగిపోయింది

రైతుకు ఆనందం దూరమైంది
మిఠాయి చేదైంది!






you may also like







No comments:

Post a Comment