Wednesday, 26 December 2018

కవితలు(page 3)



మోడుమాను
-------------------------
రామసక్కని 
ముఖము చూసి
కవితలెన్నో రాసుకుని
పాడుకున్నాను..

నీ ప్రేమ దొరుకుట
గొప్ప వరమని
పొంగిపోయాను
ఆనందంలో మునిగిపోయాను..

నీ కళ్ళు ఒలికే భావాలని ఒక్కొక్కటిగా ఏరుకుని
కాగితంపై పరుచుకున్నాను
పదిలంగా దాచుకున్నాను..

చెట్టు ఎండిపోగానే
మరో పండిన చెట్టును వెతుక్కుంటూ పక్షిలా ఎగిరిపోతావని తెలుసుకోలేకపోయాను..
కనీసం కలగనలేకపోయాను

ఎంతగొప్పదో ప్రేమ 
అంత గుడ్డిదీ ప్రేమ
ఎంత కఠినురాలు ప్రేయసి
పూసె నా తెల్లని నా మనసుకు మసి!

అమృత గుళికలు
నా ప్రేమా స్మృతులు!
గరళమాయె ప్రేయసి
విరహ వ్యథలు!!







భగ్నహృదయం
------------------------------
తన సఖి జతలో
వెలగాల్సిన హృదయం
వెలవెలబోయిందని..

తీరం దాటిన పడవై
మరో తీరం తెలియక
దూరాలను కొలుచుకుంటూ
ఒంటరి ఒంటై 
ప్రయాణం సాగిస్తున్నానని..

గతకాలపు 
చికిత్స కందని గాయాలు
తనను వేధిస్తూనే ఉన్నాయని
దానికి అతను రోధిస్తూనే ఉన్నాడని..

నాతో చెబుతుంటే విన్నాను --

అందమైన చందమామ
కురిపించిన వెన్నెలలో తడిసి
ఎండిన అడవి
ఆర్తనాదం!

ప్రేయసి చిదిమేసి,
చితిపేర్చిన భగ్నహృదయ
ప్రేమసంగీతం!

No comments:

Post a Comment