జలపాఠం
-----------------
కథ చెబుతా వింటారా
కథ చెబుతా వింటారా
హూ హూ..
పాట పాడమంటారా
పాట పాడమంటారా
హా భలే భళే
భలే భళే
తెలుసా తెలుసా మీకొక విషయం?
నీరము మనకు ప్రాణాధారం
తెలుసా తెలుసా ఇంకొక విషయం?
తాగెడి నీరు ఉన్నదె కొంచెము
సముద్ర మెంతొ పెద్దది కద సారు
అందులొ ఉన్నది నీరమే కదూ!
నిజమే పిల్లలు నిజమే నిజమే
సముద్రమంతా ఉన్నది నీరె
సంద్రపు నీరు ఉప్పుతొ కూడెను
తాగుటకు చుక్కైనా పనికి రాకుండెను
అక్కరకు రానిది
ఎంతుంటె నేమది?
నిజమే సారు నిజమే సారు
మరి ఎక్కడిది ఈ తాగెడు నీరు?
నదులు, చెరువులు జలస్తరములు
అవియే మన జీవనాధారాలు
తాగెడు నీటికి అవియె నెలవులు
నీటితొ నిండిన దేహము మనది
నీరమె లేనిది ప్రాణము ఏది?
అవును సారు అవును సారు
ప్రాణికి ప్రాణాధారము నీరు
ముందే మీతో చెప్పిన యట్లు
తాగెడి నీరు చాలా స్వల్పము
తెలుసా మీకు తెలుసా మీకు
భూమిపై ఈ నీటి లెక్కలు
తెలియదు సారు తెలియదు సారు
ఆలస్యం చెయ్యక త్వరగా చెప్పరు..
ఇలపై నీరు వందనుకుంటె
తొంభై ఏడు సంద్రపు నీరే
ఇంకా రెండు మంచై పోయే
మిగిలిందె౦త మిగిలి౦దెంత
ఆ ఒక్కటే మనం వాడేదంతా
అయ్యో సారు నీరింత తక్కువని
మాకు తెలియనె లేదు
నాకొక డౌటు నాకొక డౌటు
అయిపోదా మరి ఈ నీరు
ఆహ్ మంచి ప్రశ్న మంచి ప్రశ్న
శభాష్ కృష్ణ..
కొంత నీరు భూమిలొ ఇంకును
ఎండకు కొంత ఆవిరవ్వును
ఇంకిన నీరు భూగర్భమున దాగును
బోరులు వాటిని పైకి చేర్చును
ఆవిరి నీరు పైకి పోవును
మేఘమై తిరిగి వర్షించును
కానీ పిల్లలు తాగెడు నీరు
ఇప్పుడు ఇలపై తక్కువాయెను
అయ్యో ఇప్పుడెలా?
రేపటి భవితకు నీరెలా?
చెబుతా వినండి చెబుతా వినండి
నీటిని కాపాడాల్సింది మనమేనండి ..
నదులూ చెరువులు కబ్జాలయ్యెను
మట్టితొ పూర్తిగా పూడుకుపోయెను
పూడిక తీసి పూర్తిగ నింపుకో..
వర్షపు నీటిని ఒడిసి పట్టుకో ..
ఇంకుడు గుంతలు తవ్వుట తెల్లుసుకో..
భూగర్భమున నీటిని నిలుపుకో..
వృథా పోనీకు చుక్కైనా
రేపటికదియే దిక్కౌను!
ధన్యవాదాలు సారు
ఎన్నో కొత్త విషయాలు చెప్పారు!
నీటిని మే౦ కాపాడుతాం
రేపటి తరానికి అందిస్తాం!
-----------------
కథ చెబుతా వింటారా
కథ చెబుతా వింటారా
హూ హూ..
పాట పాడమంటారా
పాట పాడమంటారా
హా భలే భళే
భలే భళే
తెలుసా తెలుసా మీకొక విషయం?
నీరము మనకు ప్రాణాధారం
తెలుసా తెలుసా ఇంకొక విషయం?
తాగెడి నీరు ఉన్నదె కొంచెము
సముద్ర మెంతొ పెద్దది కద సారు
అందులొ ఉన్నది నీరమే కదూ!
నిజమే పిల్లలు నిజమే నిజమే
సముద్రమంతా ఉన్నది నీరె
సంద్రపు నీరు ఉప్పుతొ కూడెను
తాగుటకు చుక్కైనా పనికి రాకుండెను
అక్కరకు రానిది
ఎంతుంటె నేమది?
నిజమే సారు నిజమే సారు
మరి ఎక్కడిది ఈ తాగెడు నీరు?
నదులు, చెరువులు జలస్తరములు
అవియే మన జీవనాధారాలు
తాగెడు నీటికి అవియె నెలవులు
నీటితొ నిండిన దేహము మనది
నీరమె లేనిది ప్రాణము ఏది?
అవును సారు అవును సారు
ప్రాణికి ప్రాణాధారము నీరు
ముందే మీతో చెప్పిన యట్లు
తాగెడి నీరు చాలా స్వల్పము
తెలుసా మీకు తెలుసా మీకు
భూమిపై ఈ నీటి లెక్కలు
తెలియదు సారు తెలియదు సారు
ఆలస్యం చెయ్యక త్వరగా చెప్పరు..
ఇలపై నీరు వందనుకుంటె
తొంభై ఏడు సంద్రపు నీరే
ఇంకా రెండు మంచై పోయే
మిగిలిందె౦త మిగిలి౦దెంత
ఆ ఒక్కటే మనం వాడేదంతా
అయ్యో సారు నీరింత తక్కువని
మాకు తెలియనె లేదు
నాకొక డౌటు నాకొక డౌటు
అయిపోదా మరి ఈ నీరు
ఆహ్ మంచి ప్రశ్న మంచి ప్రశ్న
శభాష్ కృష్ణ..
కొంత నీరు భూమిలొ ఇంకును
ఎండకు కొంత ఆవిరవ్వును
ఇంకిన నీరు భూగర్భమున దాగును
బోరులు వాటిని పైకి చేర్చును
ఆవిరి నీరు పైకి పోవును
మేఘమై తిరిగి వర్షించును
కానీ పిల్లలు తాగెడు నీరు
ఇప్పుడు ఇలపై తక్కువాయెను
అయ్యో ఇప్పుడెలా?
రేపటి భవితకు నీరెలా?
చెబుతా వినండి చెబుతా వినండి
నీటిని కాపాడాల్సింది మనమేనండి ..
నదులూ చెరువులు కబ్జాలయ్యెను
మట్టితొ పూర్తిగా పూడుకుపోయెను
పూడిక తీసి పూర్తిగ నింపుకో..
వర్షపు నీటిని ఒడిసి పట్టుకో ..
ఇంకుడు గుంతలు తవ్వుట తెల్లుసుకో..
భూగర్భమున నీటిని నిలుపుకో..
వృథా పోనీకు చుక్కైనా
రేపటికదియే దిక్కౌను!
ధన్యవాదాలు సారు
ఎన్నో కొత్త విషయాలు చెప్పారు!
నీటిని మే౦ కాపాడుతాం
రేపటి తరానికి అందిస్తాం!
No comments:
Post a Comment