Monday, 29 August 2016

లేఖలు

సహస్ర కవిమిత్ర
పార్వతీపతి
లేఖ సంఖ్య:28







ప్రియ మిత్రులారా
ఉభయకుశలోపరి ఈరోజు *అర్ధ విపరినామము*నకు  
సంబంధించిన ముచ్చట్ల గురించి నేనిక్కడ రాస్తున్నాను.దీనిలోని
విషయాలను గురించి
ఒకసారి అవలోకించండి.  
*అర్ధ విపరినామము*
గతంలో జయంతిని వర్ధంతి అని పిలిచేవారు.కాలాను గుణంగా భాషలో కొన్ని అర్ధాలు మారతాయి.

త్రేతాయుగంలో రాముడు నార *చీరలు* ధరించాడు.
ఆ కాలంలో *చీర* అనగా స్త్రీ,పురుషులు ఇరువురు ధరించే వస్త్ర విశేషం.
కెంపు రంగు అనగా రాగి పాత్రను చింత పండు,ఉప్పు తో తోమితే వచ్చే రంగు.
గతంలో రాగి పాత్రలు,చెంబులు
కెంపు=చెంపు=చెంబు అయ్యింది
ఇప్పుడు చెంబు అంటే ప్లాస్టిక్ చెంబు కూడా.
అమరా వతి శాసనంలో దొరికిన మొదటి తెలుగు పదం *నాగాబు*
నాగాబు==?????
నాగాబు=నాగంపు
నాగంపు=నాగంబు
నాగంబు=నాగు.

తల దగ్గర పెట్టు కునేది కునేది కనుక తలకడ=తలగడ
కాళ్ళ కడ కాదు.
మెత్తగా  ఉంటుంది కనుక మెత్త
ఎత్తుగా ఉంటుంది కనుక దిండు
గాలితో నింపేది కనుక ఎయిర్ పిల్లో
స్వాతంత్ర్యానికి పూర్వపు గాంధీ గారి పుట్టిన రోజు అక్టోబర్ 2 తేది పత్రికలను ఒక సారి పరిశీలించండి.
గాంధీ వర్ధంతి అనే ఉంటుంది.

వర్థిల్లేది వర్థంతి. ఆయుష్షు. "వర్థయతామ్ ఇతి వర్ధంతి" అని. జీవించి ఉన్న వాళ్ళ పుట్టిన రోజుని వర్ధంతి గానూ, వెళ్ళిపోయిన వారి జన్మదినాన్ని జయంతి గానూ చెప్పుకోవాలి. చనిపోయిన రోజును జరుపుకోవటానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన మాట లేదు. వారి తిథి అనో, ఆబ్దికం అనో, లేక ఆధునిక వాదులు సంస్మరణ దినంగానో చెప్పుకోవచ్చు.
ఇలా చూసినా గతించిన వారి జన్మ దినాన్ని జయంతి అనే చెప్పాలి.
జీవించిన వారి పుట్టిన రోజును వర్ధంతి అని చెప్పాలి.
గతంలో ఉన్న భాషా జ్ఞానం,అర్ధ వివరణ ఇప్పుడు విపరీతార్ధమే.
*భాషాభిమానుల కోసం*

ఇలా మీకు ఈ ఉత్తరం రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఏమీ అనుకోవద్దే,వీలైతే
మీ మిత్రుల తో కూడా 
ఈ విషయాలను పంచుకోగలరు.
ఇక ఉంటాను
                      ఇట్లు
                  మీ హితైషి
                  పార్వతీపతి
--------------------------------------------------------------------------------------------------

పార్వతీపతి
లేఖ సంఖ్య:30

ప్రియ మిత్రులారా
ఉభయకుశలోపరి ఈరోజు *స్నేహా సౌరభానికి*
సంబంధించిన
ముచ్చట్ల గురించి నేనిక్కడ రాస్తున్నాను.దీనిలోని
విషయాలను గురించి
ఒకసారి అవలోకించండి.  

ఓ పులి కుక్కతో సావాసం చేసింది . కుక్క పులిని ఏరా ఆరేయ్ అని పిలుస్తుంది, అప్పుడు సమాజం పులిని చులకనగా చూస్తుంది. 
పులి తన గౌరవం కోసం కుక్కతో ఎందుకు సావాసం చేసానురా అని బాధపడుతూ కుక్కతో స్నేహం తగ్గించింది. కుక్క ఇది గ్రహించింది. పులి తో కుక్క గౌరవంతో మాట్లాడటం ప్రారంభించింది. పులికి ఆశ్చర్యం కలిగింది. నేను నీతో ఏమి చెప్పలేదు ఐన నువ్వు నా సమస్య తెలుసుకుని దాన్ని నువ్వే పరిష్కారం చేసావ్. ఇది ఎలా సాధ్యం అని, కుక్క పులితో ఇలా చెప్పింది. నువ్వు సమాజం కోసం బ్రతుకుతున్నావ్.. నేను స్నేహం కోసం బ్రతకుతున్నా  వెంటనే పులి చింతిస్తూ కుక్కని అక్కున చేర్చుకుంది.... " ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది కాదు..ఏలా స్నేహం చేస్తున్నాం అనేది ముఖ్యం".

ఇలా మీకు ఈ ఉత్తరం రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఏమీ అనుకోవద్దే,వీలైతే
మీ మిత్రుల తో కూడా 
ఈ విషయాలను పంచుకోగలరు.
ఇక ఉంటాను
                      ఇట్లు
                  మీ హితైషి
                  పార్వతీపతి

No comments:

Post a Comment