Monday, 28 November 2016

లేఖలు (PAGE 2)






*శ్రీ విళంబి నామ ఉగాదికి స్వాగతం*
🎈🎈🎈🎈🎈🎈🎈
నడుస్తున వత్సరమా హేమలంబ
నీకు వీడ్కోలు.
నవ్యమైన శ్రీ విళంబి
నూతన సంవత్సరమా నీకు సుస్వాగతం.
గమిస్తున్న వత్సరమా నువ్వు మిగిల్చివెళ్తున్న అనుభవాలెన్నో.
నూతన వత్సరమా నువ్వు తెచ్చే ఆనందాలపై ఆశలు ఇంకెన్నో.
గతం నాస్తి కాదు,గతమెంతో ఘనమైన నేస్తం
గతాన్ని స్వగతం చేసుకుంటూ భవిష్యత్ వర్షానికి హర్షం.
శ్రీ విళంబి అక్షరాలు కలిపితే నాలుగు.జన
జీవన ప్రయాణానికి చతుర్విద పురుషార్ధాలు
నాలుగు దిక్కులు భద్రం ఉండాలి
నలుగురు మనుషులతో కలిసి ఉండాలి అనే అంతరార్ధం ఇది.
ఓ హేమలంబమా
నువ్వు విజయాలను అందించావు.
అపజయాలను మిగిల్చావు.
గెలుపు గుర్రం ఎక్కించావు.
ఎరుపు రంగు చూపించావు
శ్రమించినప్పుడు
విజయాల వెలుగు
నిచ్చావు.
అనుకోని చీకటి వలయాలను సృష్టించావు
కాలం విలువ తెలిసినప్పుడు జగత్తుచే పొగిడించావు.
తొందరపాటుతో వ్యవహరించినప్పుడు సుతిమెత్తగా హెచ్చరించావు.
గర్వంతో తలెగరేసినప్పుడు
కళ్ళెం వెనక్కిలాగావు.
వినయంతో వ్యవహరించినప్పుడు ఆప్యాయంగా ఆశీర్వదించావు.
తోటివారిని తూలనాడినప్పుడు
తగిన శాస్తి చేసావు
ప్రక్క వారి హితం కోరినప్పుడు ఎంతో సంతృప్తినిచ్చావు.
ఎదుటి వారిని వేలెత్తి చూపినప్పుడు నాలుగు వేళ్ళు నాకు చూపించావు
లోకుల గురించి వ్యాకుల పడుతుంటే వద్దని వారించావు.
అందుకే వేగంగా పరుగెట్టి పోయిన హేమ లంబ సంవత్సరమా నీవు నా నేస్తం.ఎంతోమందికి నన్ను పరిచయం చేసావు.
అనుక్షణం నన్ను ఊరడించావు,
ఉత్సాహపు ఊపు నిచ్చావు.అలాగే
రేపు వచ్చే శ్రీ విళంబి
నూతన వర్షానికి హర్షంతో నన్ను పరిచయం చేయి.
12 మాసాల తులాభారంలో జయాప జయాలు సమానంగా వేయమని చెప్పు.
అప్పుడు పార్వతీపతికి అహం కారము రాదు.
ఆత్మ న్యూన్యత రాదు.
ఓ ఆత్మీయ మిత్రమా!
నాకు ఈ కాస్త సాయం చేయుమా
🙏🙏🙏🙏🙏🙏🙏
*🍀పార్వతీపతి*🍀
🙏🙏🙏🙏🙏🙏🙏

----------------------------------------------------------------------------------------------

*💐అస్మాకం తెలంగాణ అవతరణ కింకిణులు💐*

జయ జయ జయ ధర్మభూమి
జయ జయోస్తు విజయ భూమి.
*కృతయుగపు*
ఋషుల తపో భూమి నవనాథుల సిద్ధులగుట్ట,మోర్తాడ్ మండల మునులగుట్ట
మనసు నిండ తెలంగాణ మమకారం కొండంత.
*త్రేతాయుగపు*
శ్రీ సీతారామ లక్ష్మణుల చరణ స్పర్శతో పులకించి దండలు సమర్పించిన దండకారణ్యపు కారుణ్య ధన్యభూమి.
రామాయణపు సృష్టికర్త కృషి ఉంటే మనుషులు ఋషులౌతారన్న వన్యవాసి వాల్మీకి ఋషి జన్మించిన నవీపేట కస్పబినోల గ్రామము ఆర్ష ధర్మానికి పెద్ద ఆలవాలము
*ద్వాపర యుగపు*
రుక్మిణీమాతను పరిణయమాడిన శ్రీ కృష్ణ పరమాత్మ అనుంగు అత్తారిల్లు సంగారెడ్డి జిల్లా కొండాపురము
భారతీయ సిరి సంపదలను చాటిచెప్పు పరివారము.
అష్టాదశ పురాణాలు అవలీలగ రచియించిన వ్యాస భగవానుని జ్ఞాన భూమి ఆదిలాబాద్ జిల్లా బాసర క్షేత్ర నెలవాలము.
*కలియుగపు*
మనుకుల భూషణుడు
శ్రీ లక్ష్మీ నారసింహుడు కరుణతో వెలసిన కమనీయ క్షేత్రము యాదాద్రి దివ్య ధామము.
నీరు, నిధులు, నియామకాల సాధనకు నడుంకట్టి పదపదమని పరుగులిడిన సకల జనుల సుమ హారము మన తెలంగాణము.
అడుగడుగున అపురూప జ్ఞాపకాల నిధి బాండాగారము 31 జిల్లాల మణిహారము
మన పావన తెలంగాణము.
పంచమ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభవేళ
సతత జయోస్తు,
సకల విజయోస్తు అని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికీ జెండా వందన శుభాకాంక్షలతో....
పార్వతీపతి,సంగారెడ్డి.

-------------------------------------------------------------------------------------------------------

72వ జెండా పండగ శుభాకాంక్షలు

స్వాతంత్రం బన నరుడా
స్వైర విహారంబు కాదు
స్వైర విహారులకెపుడూ
స్వాతంత్రం బచ్చిరాదు
అంతా మా గొప్పదనమే అని మేము అనుకుంటున్నాం.కానీ ఇక్కడ మా గొప్ప ఏమీ లేదు.అంతా నీ ఇచ్చానుసారమే ఇక్కడ నడుస్తున్నది.కావాలని నువ్వే కొందరిని ఎంతో మనోహరమైన మనుషులుగా సృష్టించావు.వారి మనస్సులలో గులాబీ సుగంధాలను నింపావు.ఇంకొందరి గుండెలలో నిప్పుల కుంపట్లను ఉంచావు.
నీ ఇచ్చకు మేము ఎదురుచెప్పగలమా? చెప్పి బ్రతకగలమా?

నువ్వు ఓడిపొమ్మని శాసిస్తే ఓడిపోక నేనేం చెయ్యగలను? నేను లేవడమూ పడటమూ అంతా నీ ఇచ్చానుసారమే జరుగుతున్నది.ఇంకేమేం చేస్తావో చెయ్యి.నన్ను ఎలా మలుస్తావో, నా జీవితాన్ని ఇంకెన్ని మలుపులు తిప్పుతావో తిప్పు.

నీ అధీనంలోకి (సృష్టి) లోకి వచ్చాను.నీ చేతిలో ఉన్నాను.నీ నియమాలను పాటించక తప్పదు.నాకు స్వతంత్రం ఎక్కడుంది?నీ ఇష్టప్రకారమే నన్ను నడిపిస్తున్నావు.అలాగే కానియ్యి.కాదని నేను చెయ్యగలిగింది మాత్రం ఏముంది?
స్వతంత్రం అంటే సొంత పాలన.(జీవన)
పరతంత్రం నుండి స్వతంత్రం.
INDIPENDENCE అంటే
DIFENDENCE కాదు
సొంతంగా జీవించడం.
సొంత జీవనే స్వాతంత్ర్యం.
సొంత మనుగడే స్వాతంత్ర్యం.
భారత్ మాతాకీ జై.
పార్వతీపతి

-------------------------------------------------------------------------------------------------------

కృష్ణయ్యకు 🔔🔔లకు సంబంధం

కృష్ణుడు క్రింద ఎక్కడ పెట్టిన వెన్న
తినేస్తున్నాడని ఓ గడుసు భామ
వెన్న కుండను ఉట్టిలో పెట్టి కదిలితే
చప్పుడయ్యేలా ఆ ఉట్టికి గంటలు కట్టింది.ఎలా ఐనా కృష్ణున్ని పట్టుకుని వాళ్ళ అమ్మ ముందు దోషిగా నిలబెట్టాలని ఎంత చూసినా కృష్ణుడు రాలేదు.మాగన్నుగా నిద్ర వచ్చింది ఆ భామ కి.అప్పుడు వచ్చాడు కృష్ణయ్య.పైన పెట్టిన వెన్న కుండలను చూసాడు.తనతో వచ్చిన గోప బాలుర సాయంతో పైకెక్కి కుండను తీయడానికి చూస్తూ ఉట్టికి కట్టిన గంటలను గమనించి శబ్దం చేయద్దని గంటలకు చెప్పాడు.గంటలు ఆనందిస్తూ సరే అన్నాయి.
కృష్ణుడు కుండని దింపి వెన్నను సావాస గాళ్ళకు పంచి ఒక్క ముద్ద తిన్నాడు.వెంటనే గంటలు గణగణ మన్నాయి.ఆశ్చర్య పోయిన కృష్ణయ్య గంటలని అడిగాడు నేను చెప్పాను కదా మోగద్దని అందరూ తినేదాకా మోగలేదు.నేను నోటిలో పెట్టుకోగానే ఎందుకు శబ్ధం చేశారని.అప్పుడు గంటలన్నాయి దేవుడికి నైవేధ్యం పెట్టేటప్పుడు గంటలు మోగడం ఆనవాయితి కదా!అలవాటు పడిన ప్రాణం అందుకే అలా జరిగింది అని శరణు వేడాయి.
గంటల శబ్ధానికి భామ లేచింది.
ఒక్క ఉదుటన వచ్చింది వెన్న తింటున్న కృష్ణున్ని గట్టిగా పట్టుకుంది.దొరికాడు కృష్ణుడని తెగ సంబర పడింది.
గట్టిగా గద్దిస్తూ ఇన్ని రోజుల నుండి నా వెన్నను తింటున్న వాడా!ఎవరోయి నీవు అంది. నేను బలరాముడి తమ్ముడిని, అని చెప్తాడు. ఎందుకంటే, బలరాముడు చాలా బుద్ధిమంతుడు కదా ! అతని తమ్ముణ్ణి అంటే వదిలేస్తుందని ! బుధ్ధిమంతుని తమ్ముడు బుధ్ధిమంతుడనుకుంటా
రని ! సరే ! మా ఇంటికి ఎందుకొచ్చావు? అనడిగిందిట ఆవిడ. మా ఇల్లనుకుని వచ్చాను అని చెప్పాడంట! ఔనా ! సరే, మరి మా ఉట్టిలోని దుత్తలో చెయ్యెందుకు పెట్టావు ? అని అడిగిందిట ఆవిడ. దానికి చిలిపి కృష్ణుడు - మా దూడ ఒకటి తప్పిపోయింది. మీ దుత్తలో దాక్కుందేమో అని వెతుకుతున్నాను అని కొంటి సమాధానం చెప్పాడు.ఆ మాటలు విని ఎంత గడుసు వాడు ఈ కృష్ణుడు ఎక్కడో ఉన్న ఏ సంబంధం ఇక్కడ లేని బల రాముని పేరు చెప్పాడు.
ఎంత చమత్కారి అని ఆశ్చర్యంతో పట్టుకున్న చేతిని వదిలి ముక్కున వేలేసుకుంది.
కృష్ణుడు తుర్రు మన్నాడు.
ఇది కృష్ణుడికి 🔔గంటలకి ఉన్న సంబంధం🔔
బాల కృష్ణుడు మనలను రక్షించుగాక🙏
*పార్వతీపతి*























No comments:

Post a Comment