Tuesday, 13 November 2018

పద్యాలు (page 2)

దానహీను దరిన ధనమెంత నున్నేమి?
పైస గూడ పరుల పనికి రాదు
పుష్టి గున్న నేమి పాలనివ్వని గేదె?
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!






నీతిహీను కెన్ని నీతులు జెప్పిన

నీతిమంతు డవక నాశ మొందు
పెంట కుప్ప యందు పాలు వోసిన యట్లు
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!





మల్లె కన్న మెత్త మనసున్న పిల్లల

మనసు నొప్పి సేయ మెప్పు కాదు
సున్నితంబు తోడ సెప్పిన మేలౌను
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!









పిరికి వాడు ఎందు పనికింత రాడయా

భయము లేని వాడె బతుకు గెలుచు
భయము వదల వలెను బతుకు సంద్రము నీద
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!




పుడమి మీద లేదు పాడు పదార్థము

పాడు వాటి గుంపె పెంట కుప్ప
పెంట కుప్ప నుండె పంట కెరువు వచ్చు
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!




కష్ట మెంత దైన గులకరాయంతదె

నీదు చూపులోనె భేద ముంది
భయము తోడ జూడ భువన మంతగుపడు
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!



గుణము దూగు ధనము గలదేది హహిలోన
గుణమె విలువ బెంచు కాదు ధనము
గుణమె ఆభరణము గుణమె అందమ్మయా
విశ్వ గురువు దివ్య విష్ణుదేవ!






<<                                                                                                >>                                   
    










your are reading page 2. select next page.

















you may also like







No comments:

Post a Comment